Pages

Tuesday, December 29, 2009

మామా...చందమామా...వినరావా నా కథ !!!! :)


Disclaimer: ఈ post చదివాక ఎవరికైనా పిచ్చి పట్టడం or పట్టరాని కోపం వచ్చి పక్కనున్న వాడిని తన్నడం లాంటివి చేస్తే రచయిత ఎంత మాత్రం భాద్యుడు కాదని మనవి చేస్తున్నాను.."Readers Discretion is Advised" ;-)

కొన్ని చిన్న చిన్న కోరికలుంటాయి... అవి అంత త్వరగా తీరవు. చిన్నవే కావొచ్చు కాని really beautifulగా ఉంటాయి.అసలు నేను అనుకునేది ఒక కోరిక అని అనొచ్చో లేదో...అసలు విషయం చెప్పకుండా ఈ సాగతీత ఎందుకు రా kranthi గా అనే కదా మీ complaint ... ok ok ... అక్కడికే వస్తున్నాను ...

ఇంతకీ నా wish ఎమిటంటే "నేను బస్ లొ వెళ్తుంటే window లో నుంచి చందమామ ని చూస్తూ ... ఆ వెన్నెల్లో ... కనీసం ఒక పది నిమిషాలు నేను travel చెయ్యాలి ".
( విన్నారు కదా ... one two three ... come on!!! నా మీద tomatoes విసిరేవాళ్ళు ఒక పక్క, కొడి గుడ్లు విసిరేవాళ్ళు ఇంకో పక్క, రాళ్ళు విసిరేవాళ్ళు ఇంకో పక్క నిలబడండి ... please make a line)

కొంచెం detailed గా explain చేస్తాను.. నేను బస్ లో window పక్కన కూర్చోవాలి...కూర్చొని చందమామని చూడాలి...మరీ పౌర్నమి రోజున ఉండే చందమామ అవసరం లేదు ( ఉంటే ఇంకా అద్రుష్టం :) ) ...మరీ నెలవంక లా కూడా వుండకూడదు..8 days to 15 days(15th day is పౌర్నమి) మధ్యలో వుండే చందమమ is fine. ఎవరక్కడ ... నాకు వినపడింది ... చెప్పండి... "వీడి మొహం లా ఉంది వీడి కోరిక" అన్నది ఎవరు? ... నాకు తెలియాలి తెలియాలి తెలియాలి !!!

ఇది ఎప్పటికి నెరవేరదు అని మీరు happy గా ఉన్నారు కదా... అక్కడే మీరు పప్పు ,సాంబార్,రసం ఇత్యాది full meals constituents లో కాలేశారు ...

ఓ సారి నేను bus లో వెళ్తున్నాను ... భాగ్యనగరము నుండి భానుపురి కి...night almost 11.30 అవుతుందనుకుంటాను... నేను bus right side కూర్చున్నాను... casual గా left కి తిరిగాను ... voila .... చందమామ ...wow ... splendid ... కాని నేను అలా చూడాలి అంటే ఆ left side seats లో కూర్చున్న వాళ్ళ తలల మీదుగా చూడాలి ... వాళ్ళు ఇంక పడుకోలెదు ... నేను అలా ఎక్కువసేపు చూస్తే ... నేను వాళ్ళ వైపు చూస్తున్నానని వాళ్ళనుకొని నా గురించి " వీడు మనం పడుకున్నాక మన బ్యాగులు ఎత్తుకెళ్ళడానికి try చేస్తున్నట్టున్నాడు" అని అనుకోవడం guarantee ... ఒకవేల వారికి ఆవెశం quotient abundant గా ఉన్నట్టయితే నన్ను on-the-spot తన్నడం కూడా guarantee... అసలే నాకు IAP ( Instant-Argument-Potential ;) ) చాలా తక్కువ . ఎందుకోగాని అప్పుడు నాకు ఆ చిన్న కోరిక ఒక పెద్ద adventure లా అనిపించి drop అయ్యాను ... Missed the chance by a whisker. ఇలాంటి experiences చాలా ఎక్కువ.నేను ఒక side కూర్చుంటాను ... అయనొక side వస్తాడు ... కాని ... కాని ... ఒకసారి ...

ఒకసారి మామ కూడా నా సైడే ఉన్నాడు ... కాని దూరంగా లేడు ... పైన ఉన్నాడు ... కాని నా తల కొంచం window లో నుంచి బయటకి పెట్టి పైకి చూడాల్సొచ్చింది ... అయినా no probs అని అనుకున్నాను ... ఇక చూద్దాం అని అనుకునే లోపలే మనోడు మాయం...బస్ lite గా turn అవ్వగానే మన hero bus top మీదకెళ్ళినట్టునాడు ... మళ్ళీ కనిపించలేదు ... తల complete గా window బయట పెట్టి చూద్దాం అని అనుకున్నాను కాని ఎదురుగా ఇంకో బస్సో లేక లారీనో వస్తే నేను చుక్కల్లో(stars) కలిసిపొవడం guarantee .. అప్పుడు permanent గా చంద్రుడి పక్కన settle అయిపోవడం guarantee అని lite తీసుకున్నాను. 'Discretion is the better part of valour' కదా మరి !!! :)

ఓ సారి మా నానమ్మ వాళ్ళ ఊరినుంచి ( పల్లెటూరు ) bike మీద వస్తున్నాను... చుట్టూ చెట్లు, పొలాలు, దూరంగా కొండలు ... చీకట్లో ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా ... ఆ రోజు fullu గా వెన్నెల. But,road చాలా narrow గా ఉంది...bike drive చేస్తూనే ముందున్న road ని కొంచెం దూరం వరకు observe చేసేవాడిని... then bike lights off చేసి ఆ వెన్నెల్లో drive చేసేవాడిని.. మళ్ళీ on చేసి road చూడడం ... మళ్ళీ off చేసి ఆ వెన్నేల్లో కొద్ది దూరం ముందుకెళ్ళడం.. అలా చేశాను... కొంచం risky ... కాని superb !!!

కాని , ఇప్పటికి ఆ bus-wish తీరకుండా అలాగే ఉండిపోయింది...ఎప్పుడు night బస్ ఎక్కినా ఒకసారి windowలో నుంచి ఒక look ఇస్తాను ... "మామ" వస్తాడేమో అని !!! బస్సు కోరికే ఇంకా తీరలేదు ఇక పడవలో ప్రయాణం చేస్తూ చందమామని చూడాలంటే ఈ జన్మలో సాధ్యపడదు :(

College lo ఉన్నప్పుడు ... campus లో నేను and my friend నడుస్తున్నాము. ఆ రొజు పౌర్నమిలా వుంది..fullu వెన్నెల...మా friend తో అన్నాను " wow ... అసలు వెన్నెల "కురుస్తున్నట్టుగా" ఉంది కదా? " . అప్పుడు మా friend " అంత లేదు kranthi ... అంతా ఉట్టిదే ... నీ భ్రమ .. అలాంటిదేమి లేదు ... lite తీసుకో !!! " అని అనేసరికి నేను చుప్ !!! :) :)

నేను ఈ post లో నా wish గురించి రాస్తుంటే నాకు మా friend అన్న ఆ dialogue గుర్తొచ్చింది... నా విష్ మీకు మరీ quixotic గా అనిపించొచ్చు ... కాని casual గా అలోచిస్తే... just a simple wish...definitely,not a dreamy kind. Let me make it simpler : వర్షం పడుతున్నప్పుడు అమ్మ kitchen లో వేడి వేడి పకోడీలు or మిరపకాయ బజ్జీలు చేస్తుంటే అక్కడే kitchen లో కూర్చుని ఎలా తినాలనిపిస్తుందో ... ఇది కూడా అంతే ... what say????

P.S : చదివారు కదా...ఇప్పుడు ఇందాక టమాటాలు, గుడ్లు విసిరినవారు బుధ్ధిగా line లో వచ్చి వాటికోసం ఎవరెంత ఖర్చు పెట్టారో చెప్పండి ... reimburse చేస్తాను ... see ... how good kranthi is :) .... adios!!!!

2 comments:

Unknown said...

nee korika chinnade kaani neraverchukovadam nee okkadi chetullo ledu.. lekapothe ila try chey kranthi... pournami roju oka bus hire chesukuni window lonchi chandrudu kanipinchettu direction choose chesukuni velte sari..!! ;) nee blog ki kaadu kaani nenichina idea ku pakka tomatoes,eggs etc.,etc., lol!! 31st night travel lo aina nee korika neraverindemo rayaledu???

Kranthi said...

hi gayathri
idea nijanga innovative gaa vundi.. inkonni years try chestaanu ... kudarakapothe nuvvannattu oka bus hire chesukovaalsindhey :-) . Why 'Tomatoes' ? ... idea baavundi .... you'll get 'Tons of Thanks".

yeah ... 31st night kooda try chesanu aa korika neraverchukovadaaniki ... naadi aisle seat. naa pakkanunnaayana bus start avvagaane nidraloki jaarukunnadu . eppudithe bus aagutundo appudu maatram lechevaadu .. padukunevaadu maamuulugaa padukovachukadaa ... ledu ... window-curtain vesi marii padukunnaadu ... nenu uurukuntaana .. aayana face vaipu chuusi ... padukunnaadani confirm chesukuni ... melliga curtain move cheyadaaniki try chesanu ... koncham move ayindi .. windowki aanukuni padukovadamvalla aayana bodyki window ki madhyalo curtain stuck ayindi ... inkaastha balangaa laaguthe ayanaki nidraabhangam kaligi nannu laagi bayataki visirestaadani ... aa alochana viraminchukunnanu. ilaanti prayatnaalu ee jeevithamlo enni chesano!!!!! :-(

hey.. Thanks for the comments gayathri :-)