నాకు కోపం వచ్చింది...అయ్యో ఎవరిపైనో కాదు .. నా మీద నాకే కోఫం... చిన్నప్పుడైతే ఈపాటికి greeting cards కొనడం ..పోస్ట్ చెయడంకూడా జరిగిపోయేది .
చిన్నప్పుడు, new year రావడానికి ఒక నెల ముందునుంచే ఒక విధమైన పండగ వాతావరణం ఉంటుంది ఊరంతా .. school దగ్గర shops ముందు cards వేలాడేసి వుంటాయి...9 cards ఒక sheet లో ఉంటాయి (3 x 3)... heroes, heroines, cricketers, nature,flowers, దేవుళ్ళు, cartoons ... ఇలా రకరకాల themes లొ వుంటాయి.. friends వాళ్ళు కొన్న cards ని classలో గర్వంగా చూపించేవారు ... అందరు ఆ చూపించేవాడి బెంచ్ దగ్గరికి వచ్చి గుంపులా form అయ్యేవారు... ఆ moments లో అందరు ఎంత సంతోషంగా ఉండేవారో... Beautiful.
ఇక new year రోజు చూడాలి... ఎదవలు (ప్రేమ ఎక్కువైనప్పుడు నా ఫ్రెండ్స్ ని అలా పిలుస్తుంటాను :) ) early నిద్రలేచి, స్నానాలు చేసి ( ఈ రోజు మాత్రం ఖచ్చితంగా స్నానం చేస్తారు ఎదవలు..year starting అన్న sentiment ;-)) ..కొన్న గ్రీటింగ్ కార్డ్స్ ని సెపరేట్ గా ఒక్కో cover లో పెట్టి మళ్ళీ ఆ కార్డ్స్ అన్నింటిని ఓ బుక్ లో పెట్టుకొని ... న్యూ ఇయర్ ముగ్గులు చూసుకుంటూ... ఫ్రెండ్స్ ఇంటికి గ్రూప్స్ గ్రూప్స్ గా బయల్దేరుతారు ... నేను ఒక రెండు సార్లు వెళ్ళాను .. కాని కార్డ్స్ తో కాదు... just friendsకి company. సైకిళ్ళ మీద... మధ్యలో వేరే batch కలిసేది వెంటనే సైకిళ్ళు ఆపి " హ్యాప్పీ న్యూ ఇయర్రా " "సేమ్ టు యూ రా " :) అని చెప్పుకొని వాడి కార్డ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు .. ఒకవేల వాడి పేరు లేకుంటే కొందరు వెంటనే కొత్త కార్డ్ మీద అక్కడికక్కడే వాడి పేరు రాసి ఇచ్చేవాళ్ళు.. ఇలాంటి situation వస్తుందనే spare లో కొన్ని extra cardsపెట్టుకునేవాళ్ళు :) .close friends, best friends కి మాత్రం మంచి cards select చేసి పెట్టుకునేవాళ్ళు . స్పెషల్ అమ్మాయిలకు స్పెషల్ కార్డ్స్ ... ఇక్కడ మాత్రం cost గురించి పట్టించుకోరు ;-)
కొందరు తమ తమ favourite teachersకి కూడా కొనేవాళ్ళు..." ఇది sreenu sir కి " , " ఈ card english teacherకి " . అలా అన్నప్పుడు sirs ని చూసి భయపడేవాళ్ళు మాత్రం నవ్వుతూ satires వేసేవాళ్ళు. ఇక madams కి, sirs కి ఇచ్చే కార్డ్స్ మాత్రం కొంచెం costly గా ఉండేవి... అంటే folded cards... లొపల printed messageతో ఒక paper వుంటుంది కదా..అలాంటివన్నమాట... నేను కూడా ఒక సారి మా అనురాధా టీచర్ కి ఒక మంచి card ఇచ్చాను వాళ్ళింటికెళ్ళి (my favourite teacher and I am her best student , ,నిజంగా..నమ్మండి :) )
లోకల్లో ఉండేవాళ్ళకు నేను ఎప్పుడూ పెద్దగా cards ఇవ్వలేదు .. విషెస్ చెప్పేవాడిని.... వేరే ఊళ్ళొ ఉండేవాళ్ళకు ...అంటే ... మావయ్య కి , ఇంకా కొందరు close friends కి మాత్రంపంపించేవాడిని.
మరచిపోయాను... స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చిపుచ్చుకునే గ్రీటింగ్ కార్డ్స్ వెనక matter ఏముంటుందో తెలుసు కదా :) ఇలా....
To
Kranthi
wish you a very happy & prosperous new year
goodbye 199_
welcome 199_
From
kumar
ఇది standard template.... 99.99% ఇదే matter అందరూ copy-paste:) ఎంత innocent గా.. pure గా ఉండేవో అప్పట్లో అలోచనలు !!!!
ఇంతకీ నా మీద నాకే కోపం వచ్చిందెందుకంటె ఈ మధ్య cell phones, sms లు వచ్చాక గ్రీటింగ్ కార్డ్స్ కొనాలన్న ఆలోచనే రాలేదు ... ఒకప్పుడైతే రెండు మూడు షాపులు తిరిగి .. కార్డ్ పంపించాల్సిన వ్యక్తిని ద్రుష్టిలోపెట్టుకుని select చేసేవాడిని... తరువాత వాటిలో neat గా ఏదైనా రాసి .. ఒక బ్యూటిఫుల్ మ్యాచింగ్ కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాడిని... ఇప్పుడంతా sms లు. కాని, card కొనేటప్పుడు, post చేసేటప్పుడు కలిగే ఆనందం and ఒక కార్డ్ మనం అందుకున్నప్పుడు కలిగినంత ఆనందం మాత్రం ఆ sms ల వల్ల రాదుకదా .. ఇప్పటికీ సూట్ కేస్ లొ ఫ్రెండ్స్ పంపించిన కార్డ్స్ ఎన్ని ఉన్నాయో...అవి చూసుకుంటుంటే ఎంత బావుంటుందో !!!! :)
Anyways... ఇప్పుడు పంపించే టైమ్ లేదు కాబట్టి ఈ బ్లాగ్-పోస్టునే ఒక గ్రీటింగ్ కార్డ్ లా భావించండి :)
and I wish you a very happy new year .... adios :)
1 comment:
give a look to this post...
http://trishnaventa.blogspot.com/2009/10/blog-post_26.html
Post a Comment