Pages

Thursday, December 31, 2009

Greeting Card :)

నాకు కోపం వచ్చింది...అయ్యో ఎవరిపైనో కాదు .. నా మీద నాకే కోఫం... చిన్నప్పుడైతే ఈపాటికి greeting cards కొనడం ..పోస్ట్ చెయడంకూడా జరిగిపోయేది .

చిన్నప్పుడు, new year రావడానికి ఒక నెల ముందునుంచే ఒక విధమైన పండగ వాతావరణం ఉంటుంది ఊరంతా .. school దగ్గర shops ముందు cards వేలాడేసి వుంటాయి...9 cards ఒక sheet లో ఉంటాయి (3 x 3)... heroes, heroines, cricketers, nature,flowers, దేవుళ్ళు, cartoons ... ఇలా రకరకాల themes లొ వుంటాయి.. friends వాళ్ళు కొన్న cards ని classలో గర్వంగా చూపించేవారు ... అందరు ఆ చూపించేవాడి బెంచ్ దగ్గరికి వచ్చి గుంపులా form అయ్యేవారు... ఆ moments లో అందరు ఎంత సంతోషంగా ఉండేవారో... Beautiful.

ఇక new year రోజు చూడాలి... ఎదవలు (ప్రేమ ఎక్కువైనప్పుడు నా ఫ్రెండ్స్ ని అలా పిలుస్తుంటాను :) ) early నిద్రలేచి, స్నానాలు చేసి ( ఈ రోజు మాత్రం ఖచ్చితంగా స్నానం చేస్తారు ఎదవలు..year starting అన్న sentiment ;-)) ..కొన్న గ్రీటింగ్ కార్డ్స్ ని సెపరేట్ గా ఒక్కో cover లో పెట్టి మళ్ళీ ఆ కార్డ్స్ అన్నింటిని ఓ బుక్ లో పెట్టుకొని ... న్యూ ఇయర్ ముగ్గులు చూసుకుంటూ... ఫ్రెండ్స్ ఇంటికి గ్రూప్స్ గ్రూప్స్ గా బయల్దేరుతారు ... నేను ఒక రెండు సార్లు వెళ్ళాను .. కాని కార్డ్స్ తో కాదు... just friendsకి company. సైకిళ్ళ మీద... మధ్యలో వేరే batch కలిసేది వెంటనే సైకిళ్ళు ఆపి " హ్యాప్పీ న్యూ ఇయర్రా " "సేమ్ టు యూ రా " :) అని చెప్పుకొని వాడి కార్డ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు .. ఒకవేల వాడి పేరు లేకుంటే కొందరు వెంటనే కొత్త కార్డ్ మీద అక్కడికక్కడే వాడి పేరు రాసి ఇచ్చేవాళ్ళు.. ఇలాంటి situation వస్తుందనే spare లో కొన్ని extra cardsపెట్టుకునేవాళ్ళు :) .close friends, best friends కి మాత్రం మంచి cards select చేసి పెట్టుకునేవాళ్ళు . స్పెషల్ అమ్మాయిలకు స్పెషల్ కార్డ్స్ ... ఇక్కడ మాత్రం cost గురించి పట్టించుకోరు ;-)

కొందరు తమ తమ favourite teachersకి కూడా కొనేవాళ్ళు..." ఇది sreenu sir కి " , " ఈ card english teacherకి " . అలా అన్నప్పుడు sirs ని చూసి భయపడేవాళ్ళు మాత్రం నవ్వుతూ satires వేసేవాళ్ళు. ఇక madams కి, sirs కి ఇచ్చే కార్డ్స్ మాత్రం కొంచెం costly గా ఉండేవి... అంటే folded cards... లొపల printed messageతో ఒక paper వుంటుంది కదా..అలాంటివన్నమాట... నేను కూడా ఒక సారి మా అనురాధా టీచర్ కి ఒక మంచి card ఇచ్చాను వాళ్ళింటికెళ్ళి (my favourite teacher and I am her best student , ,నిజంగా..నమ్మండి :) )

లోకల్లో ఉండేవాళ్ళకు నేను ఎప్పుడూ పెద్దగా cards ఇవ్వలేదు .. విషెస్ చెప్పేవాడిని.... వేరే ఊళ్ళొ ఉండేవాళ్ళకు ...అంటే ... మావయ్య కి , ఇంకా కొందరు close friends కి మాత్రంపంపించేవాడిని.

మరచిపోయాను... స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చిపుచ్చుకునే గ్రీటింగ్ కార్డ్స్ వెనక matter ఏముంటుందో తెలుసు కదా :) ఇలా....

To
Kranthi

wish you a very happy & prosperous new year

goodbye 199_
welcome 199_

From
kumar


ఇది standard template.... 99.99% ఇదే matter అందరూ copy-paste:) ఎంత innocent గా.. pure గా ఉండేవో అప్పట్లో అలోచనలు !!!!

ఇంతకీ నా మీద నాకే కోపం వచ్చిందెందుకంటె ఈ మధ్య cell phones, sms లు వచ్చాక గ్రీటింగ్ కార్డ్స్ కొనాలన్న ఆలోచనే రాలేదు ... ఒకప్పుడైతే రెండు మూడు షాపులు తిరిగి .. కార్డ్ పంపించాల్సిన వ్యక్తిని ద్రుష్టిలోపెట్టుకుని select చేసేవాడిని... తరువాత వాటిలో neat గా ఏదైనా రాసి .. ఒక బ్యూటిఫుల్ మ్యాచింగ్ కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాడిని... ఇప్పుడంతా sms లు. కాని, card కొనేటప్పుడు, post చేసేటప్పుడు కలిగే ఆనందం and ఒక కార్డ్ మనం అందుకున్నప్పుడు కలిగినంత ఆనందం మాత్రం ఆ sms ల వల్ల రాదుకదా .. ఇప్పటికీ సూట్ కేస్ లొ ఫ్రెండ్స్ పంపించిన కార్డ్స్ ఎన్ని ఉన్నాయో...అవి చూసుకుంటుంటే ఎంత బావుంటుందో !!!! :)

Anyways... ఇప్పుడు పంపించే టైమ్ లేదు కాబట్టి ఈ బ్లాగ్-పోస్టునే ఒక గ్రీటింగ్ కార్డ్ లా భావించండి :)

and I wish you a very happy new year .... adios :)

Tuesday, December 29, 2009

మామా...చందమామా...వినరావా నా కథ !!!! :)


Disclaimer: ఈ post చదివాక ఎవరికైనా పిచ్చి పట్టడం or పట్టరాని కోపం వచ్చి పక్కనున్న వాడిని తన్నడం లాంటివి చేస్తే రచయిత ఎంత మాత్రం భాద్యుడు కాదని మనవి చేస్తున్నాను.."Readers Discretion is Advised" ;-)

కొన్ని చిన్న చిన్న కోరికలుంటాయి... అవి అంత త్వరగా తీరవు. చిన్నవే కావొచ్చు కాని really beautifulగా ఉంటాయి.అసలు నేను అనుకునేది ఒక కోరిక అని అనొచ్చో లేదో...అసలు విషయం చెప్పకుండా ఈ సాగతీత ఎందుకు రా kranthi గా అనే కదా మీ complaint ... ok ok ... అక్కడికే వస్తున్నాను ...

ఇంతకీ నా wish ఎమిటంటే "నేను బస్ లొ వెళ్తుంటే window లో నుంచి చందమామ ని చూస్తూ ... ఆ వెన్నెల్లో ... కనీసం ఒక పది నిమిషాలు నేను travel చెయ్యాలి ".
( విన్నారు కదా ... one two three ... come on!!! నా మీద tomatoes విసిరేవాళ్ళు ఒక పక్క, కొడి గుడ్లు విసిరేవాళ్ళు ఇంకో పక్క, రాళ్ళు విసిరేవాళ్ళు ఇంకో పక్క నిలబడండి ... please make a line)

కొంచెం detailed గా explain చేస్తాను.. నేను బస్ లో window పక్కన కూర్చోవాలి...కూర్చొని చందమామని చూడాలి...మరీ పౌర్నమి రోజున ఉండే చందమామ అవసరం లేదు ( ఉంటే ఇంకా అద్రుష్టం :) ) ...మరీ నెలవంక లా కూడా వుండకూడదు..8 days to 15 days(15th day is పౌర్నమి) మధ్యలో వుండే చందమమ is fine. ఎవరక్కడ ... నాకు వినపడింది ... చెప్పండి... "వీడి మొహం లా ఉంది వీడి కోరిక" అన్నది ఎవరు? ... నాకు తెలియాలి తెలియాలి తెలియాలి !!!

ఇది ఎప్పటికి నెరవేరదు అని మీరు happy గా ఉన్నారు కదా... అక్కడే మీరు పప్పు ,సాంబార్,రసం ఇత్యాది full meals constituents లో కాలేశారు ...

ఓ సారి నేను bus లో వెళ్తున్నాను ... భాగ్యనగరము నుండి భానుపురి కి...night almost 11.30 అవుతుందనుకుంటాను... నేను bus right side కూర్చున్నాను... casual గా left కి తిరిగాను ... voila .... చందమామ ...wow ... splendid ... కాని నేను అలా చూడాలి అంటే ఆ left side seats లో కూర్చున్న వాళ్ళ తలల మీదుగా చూడాలి ... వాళ్ళు ఇంక పడుకోలెదు ... నేను అలా ఎక్కువసేపు చూస్తే ... నేను వాళ్ళ వైపు చూస్తున్నానని వాళ్ళనుకొని నా గురించి " వీడు మనం పడుకున్నాక మన బ్యాగులు ఎత్తుకెళ్ళడానికి try చేస్తున్నట్టున్నాడు" అని అనుకోవడం guarantee ... ఒకవేల వారికి ఆవెశం quotient abundant గా ఉన్నట్టయితే నన్ను on-the-spot తన్నడం కూడా guarantee... అసలే నాకు IAP ( Instant-Argument-Potential ;) ) చాలా తక్కువ . ఎందుకోగాని అప్పుడు నాకు ఆ చిన్న కోరిక ఒక పెద్ద adventure లా అనిపించి drop అయ్యాను ... Missed the chance by a whisker. ఇలాంటి experiences చాలా ఎక్కువ.నేను ఒక side కూర్చుంటాను ... అయనొక side వస్తాడు ... కాని ... కాని ... ఒకసారి ...

ఒకసారి మామ కూడా నా సైడే ఉన్నాడు ... కాని దూరంగా లేడు ... పైన ఉన్నాడు ... కాని నా తల కొంచం window లో నుంచి బయటకి పెట్టి పైకి చూడాల్సొచ్చింది ... అయినా no probs అని అనుకున్నాను ... ఇక చూద్దాం అని అనుకునే లోపలే మనోడు మాయం...బస్ lite గా turn అవ్వగానే మన hero bus top మీదకెళ్ళినట్టునాడు ... మళ్ళీ కనిపించలేదు ... తల complete గా window బయట పెట్టి చూద్దాం అని అనుకున్నాను కాని ఎదురుగా ఇంకో బస్సో లేక లారీనో వస్తే నేను చుక్కల్లో(stars) కలిసిపొవడం guarantee .. అప్పుడు permanent గా చంద్రుడి పక్కన settle అయిపోవడం guarantee అని lite తీసుకున్నాను. 'Discretion is the better part of valour' కదా మరి !!! :)

ఓ సారి మా నానమ్మ వాళ్ళ ఊరినుంచి ( పల్లెటూరు ) bike మీద వస్తున్నాను... చుట్టూ చెట్లు, పొలాలు, దూరంగా కొండలు ... చీకట్లో ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా ... ఆ రోజు fullu గా వెన్నెల. But,road చాలా narrow గా ఉంది...bike drive చేస్తూనే ముందున్న road ని కొంచెం దూరం వరకు observe చేసేవాడిని... then bike lights off చేసి ఆ వెన్నెల్లో drive చేసేవాడిని.. మళ్ళీ on చేసి road చూడడం ... మళ్ళీ off చేసి ఆ వెన్నేల్లో కొద్ది దూరం ముందుకెళ్ళడం.. అలా చేశాను... కొంచం risky ... కాని superb !!!

కాని , ఇప్పటికి ఆ bus-wish తీరకుండా అలాగే ఉండిపోయింది...ఎప్పుడు night బస్ ఎక్కినా ఒకసారి windowలో నుంచి ఒక look ఇస్తాను ... "మామ" వస్తాడేమో అని !!! బస్సు కోరికే ఇంకా తీరలేదు ఇక పడవలో ప్రయాణం చేస్తూ చందమామని చూడాలంటే ఈ జన్మలో సాధ్యపడదు :(

College lo ఉన్నప్పుడు ... campus లో నేను and my friend నడుస్తున్నాము. ఆ రొజు పౌర్నమిలా వుంది..fullu వెన్నెల...మా friend తో అన్నాను " wow ... అసలు వెన్నెల "కురుస్తున్నట్టుగా" ఉంది కదా? " . అప్పుడు మా friend " అంత లేదు kranthi ... అంతా ఉట్టిదే ... నీ భ్రమ .. అలాంటిదేమి లేదు ... lite తీసుకో !!! " అని అనేసరికి నేను చుప్ !!! :) :)

నేను ఈ post లో నా wish గురించి రాస్తుంటే నాకు మా friend అన్న ఆ dialogue గుర్తొచ్చింది... నా విష్ మీకు మరీ quixotic గా అనిపించొచ్చు ... కాని casual గా అలోచిస్తే... just a simple wish...definitely,not a dreamy kind. Let me make it simpler : వర్షం పడుతున్నప్పుడు అమ్మ kitchen లో వేడి వేడి పకోడీలు or మిరపకాయ బజ్జీలు చేస్తుంటే అక్కడే kitchen లో కూర్చుని ఎలా తినాలనిపిస్తుందో ... ఇది కూడా అంతే ... what say????

P.S : చదివారు కదా...ఇప్పుడు ఇందాక టమాటాలు, గుడ్లు విసిరినవారు బుధ్ధిగా line లో వచ్చి వాటికోసం ఎవరెంత ఖర్చు పెట్టారో చెప్పండి ... reimburse చేస్తాను ... see ... how good kranthi is :) .... adios!!!!

Wednesday, December 23, 2009

తిను... తినిపించు... life అందించు ;)

"बड़े अच्छे लगते हैं... ये धरती ...ये नदियाँ ... ये रैना .. "
"और ? "
"और तुम "

ప్రియమైన ఇడ్లీ కి ,( మీరు చదివింది కరెక్టే, not spelling mistake)

ఎలా ఉన్నావు .... చాలా రోజులయింది కదా కలిసి.......am here ..... far way from home ... and u r there... last time నేను ఇంటికి వచ్చినప్పుడు ఆ రొజు నువ్వు లేవు ... missing you .... bye

నువ్వు లేని లోకాన్ని ఊహించుకోలేని,
నీ
kranthi.

hmm....ఇప్పుడే నా ప్రేమ లేఖ ని post చేసి వచ్చాను...మీకు ఓపిక ఉంటే నా love story చెప్తాను...వినండి ..er...చదవండి ;)

ఇడ్లీ అంటే ఇంత ఇష్టం-అంత ఇష్టం అని చెప్పడానికి words లేవు...అది రెండక్షరాల అద్భుతం!!!అసలు నా ద్రుష్టిలో ఈ ప్రపంచం లో రెండే రెండు కులాలు ..ఒకటి: ఇడ్లీలను ఇష్టపడే కులం..రెండు: ఇడ్లీలను ఇష్టపడని కులం..అంతే!!(wow... kudos kranthi ... what a philospophical thought :P )

మా ఇంట్లో అమ్మ ఇడ్లీ చేస్తుందీ. ..అసలు ..superb గా వుంటాయి . soooooooooo .... soft .... soooooooooooo white .... awesome .... చిన్నగా ... మ్రుదువుగా....haa.... beautiful !!!!.. God..please bestow me some good vocabulary to express...!!! ;) Two kinds of chutneys చెస్తుంది అమ్మ...ground nut chutney(palli), కొబ్బరి చట్ని and also కారప్పొడి..అదేంటొ అన్నీ బావుంటాయి...ఎక్కువగా మాత్రం ground nut chutney మీద base అవుతాను :)

ఇంట్లో ..Early morning... kitchen లో కి sunrays వస్తుంటాయి ...నేను నా మీద rays పడే విధంగా క్రింద కూర్చుంటాను ... mom ఇడ్లీలను cooker లొ నుంచి వేడి వేడిగా తీసి నా plateలొ పెడుతుంది ...chutney వేసుకుని నెమ్మదిగా ఇడ్లీ మీద వేల్లు పెట్టి , తుంచి..chutney గిన్నెలో ముంచి(wow,తుంచి.. ముంచి , is this poetry? :P ) ..నోట్లో పెట్టుకుంటే ..... ahaaaa .... ohooooo...you bet... heaven!!!!! ( u guys salivating. ..right?? ... you should . Ain't i talking about the most irresistable delectable thing? :P )

అప్పుడప్పుడు నేనేదైనా విషయంచెబుతుంటే aunti వాళ్ళు(dad's cousins) నవ్వుతూ " idli తినే ఫేసు....నువ్వు మాట్లాడుతున్నావా?" అని అనేవాళ్ళు...కాని నాకు మాత్రం ఆ comment ఒక complimentలా అనిపించేది..మనసులో పిచ్చి పిచ్చి happy గా అనిపించేది ;)

అదేంటో ..అసలు ఇడ్లీ విషయంలో నాకు అద్రుష్టం పడిశం పట్టుకున్నట్టు పట్టుకుంది (food గురించి మాట్లాడుతూ పడిశం ,జలుబు అంటూ సామెతలు వాడటం weirdగా ఉంటుందని తెలుసు కాని ఏమి చెయను ...situation demands ;) ) నేనెంత lucky అంటే.. భానుపురి లో (hometown) ... gandhi park దగ్గర బండి మీద ఉంటాయి ఇడ్లీలు..abbha yummy!!!! trust me..good in quality and good in taste... as usualgaa..friends eat dosas and i take idlys and they say sometimes" ఇడ్లీలు ఎలా తింటావురా బాబు !!!". ( yaaaaahoooooo..!!!once again ... a compliment for kranthi ;)) ...

ఎవరైనా నాతో "i like music/movies/books " అంటే వాళ్ళమీద వెంటనే ..ఒక friendliness కలుగుతుంది..fullu happy గా అనిపిస్తుంటుంది..అలాగే ఎవరైనా " నాకు ఇడ్లి అంటే చాలా ఇష్టం " అని అన్నారనుకోండి..వాళ్ళపై కూడా same feeling..easy gaa connect అయిపొతాను. :D

Pandora style లొ Idlora అనే planet ఉంటే వెంటనే నేను అక్కడికి jumpu...ఈ విషయంపై ఒకసారి James Cameronని కలవాలి... Do you miss me if i leave you??? :(

Kung Fu panda movie లొ last లొ Tai lang (villain) చనిపొయాక Master Shifoo " finally..am at peace" అంటూ relaxing గా పడుకుంటాడు.. నేను కూడా ఈసారి ఇంటికెళ్ళినప్పుడు ఇడ్లి తిని అలా feel అవ్వాలి :P

P.S:
My favourite dialogue related to idli:

weekend ఇంటికెళ్ళినప్పుడు మా అమ్మ నాతో " మరి..రేపు morning ఇడ్లి చెయమంటావానానా ?"
And then ..am like..wow..you could say ..on cloud 9 :)

Thursday, December 17, 2009

నా మొహం!!!!

"మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ.."

"అరే మూతి మీద మీసమున్న రోషమున్న జబర్దస్త్...."

ఈ పాటలు ఎందుకు పాడుతున్నానా అని అనుకుంటున్నారా...actually...ఈ blog కి ఈ పాటలకి సంబంధం లేదు..ఎదో మీకు inertia of motion కోసం quote చేసాను.అంతే!!!!!

మీసాలు పరువు ప్రతిష్ట కి symbolic representation అంటుంటారు కదా... మనకంత idea ఏమీ లెదు .... కానీ ఒక చిన్న story :

jntu campus లొ join అవ్వడానికి కొన్ని రోజుల ముందు నాకు మా friends పెద్ద class తీసుకున్నారు...నేను ఎలా ఉండాలి ragging period లో అని ... ఇప్పుడు మన point మీసాలు కబట్టి ఆ part నేను చెబుతాను..

"ఒరేయ్ kranthiగా ...నువ్వు ముందే మీసాలు తీసి college కి వెళ్ళకు..seniors తీయమని warning ఇస్తారు కదా అప్పుడు తీయి..అలా చేస్తే నువ్వు భయపడ్డావని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఖుషీ అవుతారు...". అప్పటికే ragging ని తలుచుకుని నా గుండెలదిరిపోతుంటే ఈ ఏదవలు chance దొరికినప్పుడల్లా నాకు గీతొపదెశం చేసేవాళ్ళు... time బాబు ..time!!!!! :)

so...నా instant-గురువులు చెప్పినట్టే మీసాలతో వెళ్ళాను... అప్పట్లో మరీ thick గా ఏమీ ఉండేవి కాదు :) ..కాని ఊండేవి. hostelల్లొ నన్ను చూడగానే ఒక్కరు కాదు ఇద్దరు కాదు..whole hostelలొ వున్న seniors నన్ను మీసాలు తీయమన్నారు. ..politeగా చెప్పారనుకుంటున్నారా... అంత లేదండి బాబూ... మచ్చుకు కొన్ని dialogues: "రేయ్...మళ్ళీ నేను కనపడ్డప్పుడు మీసాలతో వున్నావో..నీ యబ్బ...నేనే blade తెచ్చి మరీ class roomలొ గీకుతా!!!" నాకు కోఫం వచ్చి వెంటనె " నేను తీయను.ఏమి చేసుకుంటావో చేసుకోపోరా!! " .అన్నాననుకున్నారా ... correct... మనకంత scene లేదు...ఒక్క మాట మాట్లడలేదు నేను.. సరే అని వాడి permission తీసుకుని అక్కడినుంచి jump. ఇంకొకడు drawing classకి వెళ్తూ వెళ్తూ నన్ను చూసి ఆపాడు..నా ఖర్మ (and also కర్మ :( )వాడి దగ్గర ఓ పెద్ద blade వుంది...నిజంగా విధి యమ powerful కదా!!!! వాడూ నాface పట్టుకున్నాడు...వాడి freindని blade open చెయమన్నాడూ...భయానికి ఇంకా ఏమన్నా synonyms/పర్యాయపదాలు వున్నాయో లేవో నాకు తెలియదు కానీ ...ఒకవేళ ఉంటే మత్రం most powerful and intense word ఇక్కడ suit అవుతుంది... కొద్దిసేపు నన్ను ఆడుకున్నాక వాళ్ళ పైశాచికానందం subside అయ్యాకా " నా కొడ_ రేపు కనక ఇలా కనిపించావనుకో ...తెలుసు కదా ఏమి జరుగుతుందో ?" అని warning ఇచ్చి వదిలేశారు..
Next day morning...freind ని వాడి 1960 model razor అడిగి తీసుకున్నాను ... ఓ కొత్త blade అప్పు తీసుకున్నాను..ఇంకా my cintholసోప్..soap మాత్రం నాదే.... no shaving cream or foam ..no brush... ..జీవితంలో first time self-shaving...washroom mirrorముందు నిలబడి faceki soap రాసుకున్నాను..ఆ 1960 model razor లొ blade fix చేసి అత్యంత జాగ్రత్తగా face దగ్గర land చేశాను..నెమ్మదిగ ముందుకు కదిలించాను for take-off...ఒక రెండు ఇంచులు journey అయ్యాక ఒక్కసారి నేను వచ్చిన path (just shaved area)చూశను...volcano explode అయితే వచ్చే lava లా రెండు చోట్ల blood coming...ముందు భయమేసింది.తరువాత బాధేసింది..ఆ తరువాత నామీద నాకే అసహ్యమేసింది....కాని వెనకడుగు వేయలేము...అంతే ముందుకు కదిలాను... ఒక చెంప వైపు చేసేసరికి ఇంకొ చెంప వైపు soap dry అయ్యేది...ఖర్మ....మళ్ళీ సోప్..మళ్ళీ మంట...మొత్తానికి అయిపొయింది...ఒకసారి face నీ water తో wash చేసాక అద్దంలొ చూసుకున్నాను...faction గొడవల్లో నరుక్కున్నాక రక్తం తో వుంటారు చూడండి....అలా వుంది నా face...... no after shave...full blood :(
collegeకి వెళ్దామని roomలొ ఉంచి బయటకి రాగానే ఒక senior " నీ యబ్బ..!!!! ఎంట్రా ఆ shaving...first timeaa...చల్ నడూ...వెళ్ళి మళ్ళీ చేసుకోపో..." దాని meaning మీకు అర్థం అయ్యిందికదా...సరిగా చేసుకోలేదు...మళ్ళీ వెళ్ళాను..మళ్ళీ చెసుకున్నాను...మళ్లీ faction cuts...samarasimhareddy-narsimhanayudu type అన్నమాట!!!! ;)

ఇదంతా ఎందుకు చెసింది..seniors ని impress చేయడానికే కదా....?? కాని తరువాత కొందరు seniors పట్టుకొని.."ఎవడ్రా నిన్ను మీసాలు తీయమన్నది..ఏం పేరు వాడిది...చెప్పు,చెప్పు,చెప్పు " అంటూ saikumar voiceలొ ఇంకో side నుంచి attacking start..నాకేమి అర్థం కాలేదు... పేరు చెబితే వాళ్ళు వాళ్ళు తన్నుకొని...చెప్పినందుకు వాడొచ్చి మళ్ళీ నన్ను తన్నడం..ఇవన్నీ నాకు అవసరమా అని.... " లేదు..లేదు...మీసాలు తీయమని ఎవరూ చెప్పలేదు..నేనే తీశాను...". నవ్వుతూ చెప్పేవాడిని . నా మొహం...నా ఖర్మ...నా face...!!

మీసాలు తీశాక కొన్ని రొజులకు ఇంటికెళ్ళాల్సొచ్చింది...ఇక చూసుకోండి..నన్ను football ఆడుకున్నారు అంతా...మా dad sisters(cousins) అయితే ..వామ్మొ ...ఎవరికీ వద్దు ఆ బాధలు ..amolpalekar golmal movie ని refer చేస్తూ నాకు చుక్కలు చూపించారు...అందులో కూడా అతను మీసాలు తీసేస్తాడులెండి...మా మామయ్య కూడ అదో styello నవ్వాడూ...ఇంతవరకు నాకు ఆ నవ్వుకు అర్థమేంటొ తెలియలేదు..అడగాలి ఈసారి కలిసినప్పుడు....hey ఒక complimentకూడా వచ్చింది..మా తాతయ్యకి నచ్చింది నా మొహం : face without moustaches... :)

ఏంటో... తరువాత మళ్ళీ యదావిధిగా పెరిగాయి...seniors మళ్ళి అడగలేదు...so..మళ్ళీ మీసలొచ్చేసాయి.... కాని కొందరు friends మాత్రం అప్పటినుంచి మీసాలు తీసేసేcontinueఅవుతున్నారు...sreedhar... is good example...నాకూ తరువత చాలా సార్లు అనిపించింది అనవసరంగా మీసాలు పెంచానని..లేకుండా continue అవ్వాల్సింది...కాని తీసే ధైర్యం చెయ్యలేదు... నా మొహంలా(మీసాలున్న మొహంలా ;) ) ఉంది కదా నా కోరిక!!!!

P.S: మీసాల్లేకుండా నా మొహాన్ని photo తీయుంచుకుందామనుకున్నాను అప్పట్లో......ఛా!!!!! కుదర్లేదు...ఎందుకంటే ఎప్పుడూ ఎవడో ఒకడు(seniors) ragging చేయడానికి పట్టుకెళ్ళేవాళ్ళు !!!!