Pages

Monday, January 12, 2009

We Miss You...dhaani

Dear dhaani...


It does hurt us yaar...you should not have gone that far...


ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడివి..అన్నీ చాలా లైట్ తీసుకునేవాడివి....i have never seen you cry....but you made us cry this time.


I still remember...chandraiah sir used to say... "ఒరేయ్ దానిగా పుల్లారెడ్డి చెరువులో బియ్యం తింటూ school కి lateగా వస్తావా" అని fullగా తిట్టినాకూడా నీకు చాలాlight.

I still remember....ఒకసారి ఒకతను.. hypnotist school కి వచ్చి అందరిని tranceలో కి పంపించాడు .మేమందరము పూర్తిగా hypnotise అవ్వలెకపోయాము but ....అప్పటి వరకూ నువ్వు ఆ lineలో లేనేలేవు కాని మధ్యలొ వచ్చావు ..నిలబడ్డావు ...ఇక తరువాత జరిగిన సంగతి we never forget... నిన్ను సూదులతో గుచ్చాడు. ice పైన కూర్చోపెట్టారు .మాకందరికి అది నిజమా లేక నువ్వు act చేస్తున్నావో అర్థం కాలేదు.

I still remember .......నేను, నువ్వూ, హరి school-daysలో ...హరి వాళ్ళ డాబా పైన cricket ఆడెవాళ్ళము . ఒక సారి.. నేను 400 కొట్టి Lara Test-record break చేసాను .నువ్వూ హరి నాకు బౌలింగ్ చేయలేక నానా కష్టాలు పడ్డారు. హరికైతే నా batting చూసి out చేయలేక విరక్తి కూడా కలిగింది.But you enjoyed every second and my every run.

I still remember..నీ cycle వెనక Daniel అని వ్రాసి ఉండేది.అది చూసి మేమందరము నీ పేరు dhaniah నా లేక 'daniel'aa అని confuse అయి నిన్ను అడిగేవాళ్ళము .

I still remember....నిన్ను మన Jani ... nickname తొ పిలిచినా చాలా casualగా తీసుకొనేవాడివి. నవ్వేవాడివి.ఎవరు ఏమన్నా కూడా నువ్వెప్పూడూ feel అవ్వలేదు .

I still remember....సరిగా చదవలేదని chandraiah sir కొట్టినా కూడ..ఆ moment భయపడినట్టు act చేసి..sir వెళ్ళీపోయాక నీ స్టైల్లో నువ్వు నవ్వేవాడివి కదా?

I still remember...నువ్వు నీ cycle పైన హరిని potti sriramulu center లొ వున్న వాళ్ళ ఇంటినుండి రోజూschool కి తీసుకొచ్చేవాడివి కదా..

I still remember..ఇది మాత్రం నేను అస్సలు మర్చిపోలేను దాని. మన class లో generalగా exams అయిపోగానేసినిమాకి వెళ్ళేవాళ్ళు.నేను వెళ్ళేవాడిని కాదు .కాని oneday.. I decided to go . సినిమా పేరు "I Love India".. నేను హరి వాళ్ళ డాబా పైన హరితొ కలిసి wait చేస్తున్నా ...మిగతా friends కోసం..ఇంతలో నువ్వు వచ్చావు .వచ్చి calmగా వుండక.."ఆ సినిమా బాలేదు..చాలా vulgargaa వుంది ..చూడొద్దు .." అని చెప్పావు.... మేమందరము అప్పుటికప్పుడు ...వేరే movie plan చేసాము.Movie name:" అసలే పెళ్ళైనవాడ్ని" నరెష్ hero.. మేము అదేదో comedy cinema అనుకుని వెళ్ళాము. కాని ఈ movie ఎంత పిచ్చి సినిమానో వెళ్ళాక తెల్సింది .Theatreలో DV వాళ్ళ relatives ఎవరో కలిసారు. fully embarrassed.. నా అసలు బాధ ఇంటికి వెళ్ళాక చూడాలి. 6 to 9 show అయిపోయాక ఇంటికి వెళ్ళి calmగా తిని భయం భయంగా పడుకోవడానికి try చేస్తున్నప్పుడు ... మా మమ్మీ వచ్చి ఏ సినిమా కి వెళ్ళారు అని అడిగినప్పుడు నేను "అసలే పెళ్ళైనవాడిని" అని చెప్పినప్పుడు నన్ను ఎలా తిట్టిందో తెలుసా ...next day..classలో...నువ్వు అసలు" I love india" cinema చూడకుండానే బాగాలెదని అబద్దం చెప్పానని నువ్వు నవ్వుతుంటే మా అందరికి ఎలా అనిపించిందో నాకు ఇంకా గుర్తుంది.అసలే రాధగాడికి దేశభక్తి సినిమాలు అంటే బాగా ఇష్టం..వాడికైతే అంతకుముందురోజు నరెష్ గాడి సినిమా చూస్తున్నంతసేపు పిచ్చి కోపం వచ్చింది. .తరువాత చాలా సార్లు అది గుర్తు తెచ్చుకుని నవ్వుకునేవాళ్ళం.

I still remember....... నువ్వు అందరిని "జోకీ(jokiiiiiiiii...) boy " అంటూ నవ్వుతూ వుంటే నేను, రాధా, హరి నీతో పాటు నవ్వేవాళ్ళము... enjoy చేసేవాళ్ళము ...

I still remember......Drill period లో ఎంత interesting gaa kabaddi ఆడేవాడివి కదా....full enjoy చేసేవాడివి.

నువ్వు school uniformలో .. sky-blue polyester shirt , ఇంకా short knickers..వెనక వీపు పైన bagవేసుకుని bag- strap ని left handతో ముందుకు లాగుతూ ...right hand లో lunch boxతో school కి వచ్చేవాడివి కదా...I still remember.

మీ ఇంట్లో ఎన్ని problems వున్నా కూడా నువ్వు school ల్లో ఎప్పుడూ happy గా నే వున్నావు .....
Last year friends అందరము సంక్రాంతి time లో కలిసాము, అప్పుడు నీకోసం try చేస్తే నువ్వు కలవలేదు.నువ్వు కూడ వచ్చి ఉంటే బావుండేది ...

Last week..నీకు heart-attack వచ్చి....ఇలా జరిగిందని తెలియగానే మీ ఇంటికి వెళ్ళాము..మీ పిల్లలు జీవన్ and చిన్న పాపను చూసాను ...jeevan చాల active గా వున్నాడు..so cute...నేను తనతో మాట్లాడాను.. తనకేమి తెలియదు కదా ..ఈ age లో ఏమీ అర్థం కూడా కాదు..వాళ్ళ friends తో కలిసి chocolatesతింటున్నాడు . ఇంకో friend వచ్చి జీవన్ తో " అరేయ్ నాక్కూడా ఇవ్వరా" అని అడుగుతే jeevan " మరి... మరి....నువ్వు ఇచ్చావా నాకు అప్పుడు" అని అంటుంటే.. మనము కూడా చిన్నప్పుడు అలాగే behave చేసేవాళ్ళము కదా అని అనిపించింది....తనున్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధేసింది .

ఇప్పటికి నాకు నమ్మబుద్ది కావద్డం లేదు.....ఇలా జరిగిందంటే.....

I still feel the softness of my sky-blue school uniform.
I still feel the warm sunlight touching my body while going to school.
I still see the smiling faces of my friends in the classroom and I see you there.....
I see you there...smiling....laughing....heartily....


you should not have gone that far.....
you should not have gone....

-Your Kranthi







No comments: